Uber Titanic : గత కొన్ని రోజులుగా వరుణ తుఫాను తాకిడికి బెంగళూరు అతలాకుతలమవుతోంది . లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెంగళూరులోని రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతలో, ఉబర్ బెంగళూరుకు టైటానిక్ బోట్ వ్యవస్థ గురించి కూడా ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబర్ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా టైటానిక్ బోట్ లేఅవుట్ ఫోటోను షేర్ చేసింది. ఈ…
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
సూర్యాపేట జిల్లాలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల నివేదిక ప్రకారం 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగిందని.. ప్రజలకు విశ్వాసం కలిగించేందుకే తన పర్యటన అంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారని, నివేదిక సమర్పించారని సీఎం తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం అసోంను కుంగదీస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత వరదల కారణంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 11 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మానస్, పగ్లాదియా, పుతిమరి, కొపిలి, గౌరంగ్, బ్రహ్మపుత్ర నదుల నీటిమట్టం కూడా అసోంలోని పలు చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. గోల్‌పరా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చిన్నారులు…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌తో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.. ఇక, సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు కీలక సూచనలు చేశారు.. సైబరాబాద్ కమీషనరేట్‌లో సిబ్బందిని అలర్ట్ చేసినట్టు తెలిపారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీపీ.. మరో 24…