CM Revanth Reddy: హైదరాబాద్ నగరంలోని మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 65 ఏటీసీలను వర్చువల్ గా స్టార్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలను ఏటీసీలుగా ప్రభుత్వం మార్చింది.. చదవుతో పాటు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి అన్నారు. స్టూడెంట్స్కు చదువుతో పాటు నైపుణ్యం కూడా అవసరం.. యువతలో నైపుణ్యాలు పెంపు కోసం టాటాతో చర్చలు జరిపామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఇక, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రూ. 2,400 కోట్ల ఖర్చు పెట్టి ఏటీసీలను అందుబాటులోకి తెచ్చాం.. సంకల్పం ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.. టాటా సహకారంతో ఏటీసీలను అభివృద్ధి చేశామన్నారు. సరైన స్కిల్ ఉన్న ఉద్యోగులు దొరకడం లేదని ఆటోమొబైల్ వ్యాపారులు నాతో చెప్పారు.. త్వరలోనే మరో 53 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నాం.. భవిష్యత్ లో మొత్తం 116 ఏటీసీలనను నెలకొల్పబోతున్నామని చెప్పుకొచ్చారు. సాంకేతిక నైపుణ్యం లేకపోతే ఇంజనీరింగ్ పట్టా కూడా నాలుక గీసుకోవడానికి పనికి రాదు అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.
Read Also: Rajastan: అసలు మీరు మనుషులేనా.. అపుడే పుట్టిన శిశువు నోట్లో ఫెవికిక్..
అయితే, గత పాలకుల నిర్లక్ష్యంతో పదేళ్లు ఏం జరగలేదు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా యువత ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు.. చైనా, జపాన్ లాంటి దేశాలు మన ముందు మోకరిల్లే పరిస్థితులు వస్తాయి.. చదుదు ఒక్కటే మీ తలరాతను మారుస్తుందని ఆయన తెలిపారు. కేవలం సాఫ్ట్ వేర్ కోర్సులతోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవద్దు అని సూచించారు. ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి రూ. 2 వేల స్టైఫండ్ ఇస్తామన్నారు. విద్యార్థులే గంజాయి వ్యాపారం పరిస్థితి వచ్చింది.. వ్యసనాల బారిన పడితే తల్లిదండ్రుల బాధను మీరు అంచనా వేయలేరని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు.