రాష్ట్రపతి భవన్లో 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ, బీజేపీ మిత్ర పక్ష ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలంతా హాజరయ్యారు. అలాగే మాజీ ఉప రాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధన్కర్ దంపతులు, తదితరలంతా హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Congress Vs BJP: మోడీని తల్లి హెచ్చరిస్తూ ఏఐ వీడియో విడుదల.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆగ్రహం
సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా.. ప్రతిపక్ష అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దాదాపు 152 ఓట్లతో రాధాకృష్ణన్ విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అల్ప పీడనం ఏర్పడే అవకాశం!
రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ ఫలితాన్ని ప్రకటిస్తూ.. 781 మంది ఎంపీల్లో 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని.. 98.2 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. 752 బ్యాలెట్లు చెల్లుబాటు కాగా.. 15 చెల్లనివి కావడంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల మెజారిటీని 377కి తగ్గించారు. ఇక ఎన్డీఏకు 427 మంది ఎంపీల మద్దతు కాగితంపై ఉండగా.. వైఎస్ఆర్సీపీకి చెందిన 11 మంది శాసనసభ్యులు కూడా రాధాకృష్ణన్ కు మద్దతు ఇచ్చారు. ఎన్డీఏ అభ్యర్థికి ఊహించిన దానికంటే 14 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇది ప్రతిపక్ష శిబిరం నుంచి క్రాస్ ఓటింగ్ కారణంగా అదనంగా ఓట్లు వచ్చాయి.
జూలై 21న జగదీప్ ధన్కర్ అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి.
LIVE: Swearing-in-Ceremony of the Vice President-elect of India Shri C P Radhakrishnan https://t.co/dQbY3tRks9
— President of India (@rashtrapatibhvn) September 12, 2025