కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై పశ్చిమబెంగాల్‌లోని సీల్దా కోర్టు అభియోగాలు మోపింది. సంజయ్ రాయ్‌పై భారతీయ న్యాయ్ సహిత 103(1) లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై మరోసారి ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా మంగళవారం 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. తాజాగా ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.