Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shai Hope Reveals MS Dhoni Advice: భారత్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించిన కరీబియన్ జట్టు.. వన్డే చరిత్రలో తమ అత్యధిక విజయవంతమైన ఛేజ్‌ను నమోదు చేసింది. ఈ అద్భుత విజయంలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హోప్ 143 బంతుల్లో అజేయంగా 162 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ భారీ ఛేజ్‌లో తనకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పిన మాటలు ఎంతో ఉపయోగపడ్డాయని హోప్ వెల్లడించాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఎంఎస్ ధోనీ ఇచ్చిన సలహా తనకు గుర్తొచ్చిందని షై హోప్ చెప్పాడు. నీకు అనిపించిన దానికంటే నీ దగ్గర ఎప్పుడూ ఎక్కువ సమయం ఉంటుంది అని ధోనీ తనతో చెప్పినట్లు హోప్ వెల్లడించాడు. ఆ మాటలను గుర్తు చేసుకుంటూ ఛేజ్‌ను చిన్న చిన్న దశలుగా విభజించి ముందుకు సాగామని తెలిపాడు. ‘ఛేజింగ్‌ను నేను ఎప్పుడూ ఇష్టపడతాను. ముఖ్యంగా భారత్‌లో డ్యూ ప్రభావం ఉండటంతో లక్ష్యాన్ని ఛేదించడం కొంత సులభంగా ఉంటుంది. ఈ సిరీస్‌ను మంచి విజయంతో ముగించాలని అనుకున్నాం. సుమారు 30 ఓవర్లు పూర్తయ్యే సమయానికి నా గజ్జల్లో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాను. మా జట్టులో ఒక బ్యాటర్ ఇప్పటికే అందుబాటులో లేడు. పైగా ఆరంభంలోనే ఓ కీలక వికెట్ కూడా కోల్పోయాం. దీంతో పరిస్థితి సవాల్‌గా మారింది’ అని హోప్ చెప్పాడు.
Also Read
- SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
- Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
- ICC U19 Women's T20 World Cup 2027: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితోంటే!
- Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
‘ఈ సమయంలో క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీతో నేను గతంలో జరిపిన సంభాషణ గుర్తొచ్చింది. నీకు అనిపించిన దానికంటే ఎప్పుడూ ఎక్కువ సమయం ఉంటుంది అని ఆయన చెప్పారు. అందుకే ఛేజ్‌ను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించాం. చివరి దశలో బౌండరీలు ఎలా సాధించాలనే దానిపై దృష్టి పెట్టాను. ఓవర్‌రేట్ పెనాల్టీ కారణంగా భారత్ అదనపు ఫీల్డర్లను సర్కిల్‌లోకి తీసుకురావాల్సి వస్తుందని నాకు తెలుసు. స్కోరును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్లో ఉండాల్సి రావడం బౌలింగ్ జట్టుకు ఎప్పుడూ కష్టమే. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ అంశాలన్నింటినీ లెక్కలోకి తీసుకున్నాను. చివర్లో అన్నీ మా అనుకూలంగా కలిసొచ్చాయి’ అని హోప్ వివరించాడు.
‘మేము కొన్ని దశల్లో చాలా మంచి క్రికెట్ ఆడాం. మా బ్యాటర్లు పరుగులు సాధించారు. అదే మేము కోరుకున్నది. గత రెండు, మూడు సంవత్సరాలుగా మా బ్యాటర్లు మరింత నిలకడగా రాణిస్తున్నారు. భారీ స్కోర్లు సాధించాలని మేము వారిని కోరుతున్నాం. భారత్‌లోని ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే. ఇక్కడ పరిస్థితులు బ్యాటర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయని మాకు తెలుసు. కాబట్టి బౌలర్లు తమ నైపుణ్యాలను అత్యుత్తమంగా ప్రదర్శించాలి. బౌలింగ్ పరంగా ఈ సిరీస్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఈ అనుభవాన్ని ఆటగాళ్లు ముందుకు తీసుకెళ్లి.. బౌలింగ్ విభాగంలో మరింత మెరుగుపడతారని ఆశిస్తున్నాను. నాకు కోలుకోవడానికి రెండు రోజులు సమయం ఉంది. ఈ సమయంలో పూర్తిగా కోలుకుని తదుపరి మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని ఆశిస్తున్నాను’ అని హోప్ చెప్పాడు.
భారత్ తొలుత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అజేయంగా 129 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 92 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులతో రాణించారు. దీంతో వెస్టిండీస్ ముందు 352 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. వెస్టిండీస్ బ్యాటర్లు ఏమాత్రం తడబడకుండా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హోప్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను తమ వైపు తిప్పాడు. 143 బంతుల్లో 162 పరుగులతో అజేయంగా నిలిచి చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయానికి చేర్చాడు. అతడికి అమీర్ జాంగూ 67 పరుగులు, కీమో పాల్ 44 పరుగులతో కీలక సహకారం అందించారు. రెండు రోజుల్లో భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!