Dera Baba: హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్‌కు మరోసారి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన ఈరోజు (జనవరి 28) ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనను స్వాగతించేందుకు డేరా బాబా ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు వచ్చింది.
Dera Sacha Sauda: 2015 నాటి మూడు ఇంటర్‌లింక్డ్ బర్గారీ సాక్రిలేజ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై విచారణపై పంజాబ్ – హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. బర్గారీలో గురుగ్రంథ సాహిబ్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై గుర్మీత్ రామ్ రహీమ్‌పై జరుగుతున్న మూడు కేసుల్లో విచారణను మార్చిలో పంజాబ్ హర్యానా హైకోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులను పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు…
‘డేరా సచ్చా సౌదా’ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌కు ఎలక్షన్ కమిషన్ సోమవారం ఆమోదం తెలిపింది. దీనిపై హర్యానా కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈరోజు (మంగళవారం) ఈసీకి లేఖ రాసింది.
డేరా సచ్చా సౌదా అధినేత గుర్మింత్ రామ్ రహీమ్ సింగ్ కు పంజాబ్-హర్యానా హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింద. రంజిత్ సింగ్ హత్య కేసులో అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది.
Gurmeet Ram Rahim Singh: అత్యాచారం, హత్య దోషి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరాబాబా)కి మరోసారి పెరోల్ మంజూరైంది. తాజాగా 50 రోజలు పాటు పెరోల్ లభించింది. గత నాలుగేళ్లలో ఆయనకు పెరోల్ రావడం ఇది 9వ సారి. అని పెరోల్ పొడగింపుకు హర్యానా సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆయన రోహ్‌తక్‌లోని సునారియ జైలులో ఉన్నాడు. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో…
డేరా బాబా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు ఈ పేరు తెగ వినిపించేది.. అతి తక్కువ కాలంలోనే బాగా ఫెమస్ అయ్యాడు.. అత్యాచార ఘటనతో జైల్లో ఉంటున్నాడు.. సిర్సాలోని తన ఆశ్రమ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న అతను హర్యానాలోని సునారియా జైలులో 2017 నుండి ఖైదు చేయబడ్డాడు. అంతకుముందు ఫిబ్రవరిలో, డేరా చీఫ్‌కు మూడు వారాల ఫర్లో మంజూరు చేయబడింది. ప్రస్తుతం రోథక్‌లోని సునారియా…
Dera Baba: అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా(55)కు కోర్టు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో హర్యానాలోని సనారియా జైలులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
Rakhis for Gurmeet Ram Rahim:హర్యానా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రాహీమ్ సింగ్ కు ఇబ్బడిముబ్బడిగా రాఖీలు, గ్రీటింగ్ కార్డులు వచ్చిపడుతున్నాయి. దీంతో పోస్టల్ శాఖ వాటిని వేరు చేసేందుకు పగలు రాత్రి కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డేరా బాబా భక్తులు రామ్ రహీమ్ సింగ్ కు వేలల్లో రాఖీలు పంపుతుంటారు. ప్రస్తుతం రోహ్ తక్ లోని సునారియా…