Gulzar Birthday Special : మధురం నిండిన జార్… గుల్జార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gulzar Birthday Special : సంస్కృత ప్రభావం నుండి తెలుగు భాష తప్పించుకోలేనట్టే, ఉర్దూ పదాలు లేకుండా హిందీ శోభించదు. ఈ విషయం తెలిసిన వారు ఉర్దూను అందంగా, హిందీ సాహిత్యంలో చొప్పించేవారు. అలా ఎందరో హిందీ చిత్ర గీతరచయితలు సాగారు. వారిలో గుల్జార్ బాణీ ప్రత్యేకమైనది. కేవలం పాటలతోనే కాదు, మాటలతోనూ మురిపించిన ఘనుడు గుల్జార్. కథకునిగానూ కట్టిపడేశారు. దర్శకత్వంతోనూ మురిపించారు. గుల్జార్ మాట, పాట, దర్శకత్వం అన్నీ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి.
గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. 1934 ఆగస్టు 18న అవిభాజ్య భారతదేశంలోని దినా నగరంలో ఆయన జన్మించారు.
గుల్జార్ అన్నది ఆయన కలం పేరు. ఆ పేరుతోనే దేశవ్యాప్తంగా సాహిత్యాభిమానులను మురిపించారు. సాహిత్యంతో ఆస్కార్ అవార్డును అందుకున్న తొలి భారతీయునిగా చరిత్రలో నిలిచారు గుల్జార్. ఎ.ఆర్. రహమాన్ బాణీల్లో రూపొందిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’లో గుల్జార్ రాసిన ‘జై హో…’ గీతం ప్రపంచ వ్యాప్తంగా సంగీతప్రియులను ఎంతగానో అలరించింది. ఈ పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ గుల్జార్ సొంతమయింది. ఇక గుల్జార్ కలం నుండి జాలువారిన పాటలు ఐదు నేషనల్ అవార్డ్స్, 22 ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. దర్శకునిగానూ గుల్జార్ బాణీ అనితరసాధ్యమనిపిస్తుంది.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
గుల్జార్ ను ప్రముఖ దర్శకుడు బిమల్ రాయ్, ప్రఖ్యాత గీత రచయిత శైలేంద్ర ఎంతగానో ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే చిత్రసీమలో అడుగు పెట్టారు గుల్జార్. 1963లో బిమల్ రాయ్ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘బందినీ’ చిత్రం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు గుల్జార్. యస్.డి.బర్మన్ స్వరకల్పన చేసిన ఈ చిత్రంలో శైలేంద్ర అన్ని పాటలూ రాయగా, “మోరా గోరా అంగ్ లై లే…” అంటూ సాగే పాటను గుల్జార్ రాశారు. లతా మంగేష్కర్ పాడిన ఈ పాటతోనే గీత రచయితగా ఆయన తొలి అడుగు వేశారు. తరువాత హృషీకేశ్ ముఖర్జీ తెరకెక్కించిన ‘ఆశీర్వాద్’ చిత్రం కోసం వసంత్ దేశాయ్ స్వరకల్పనలో ఒక పాట మినహా అన్ని పాటలూ రాశారు గుల్జార్. ఈ సినిమాతోనే ఆయన మాటల రచయితగానూ మారారు.
‘మేరే అప్నే’ అనే చిత్రంతో 1971లో గుల్జార్ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకునిగా నిలిచారు. “అచానక్, పరిచయ్, కోషిష్, ఆందీ, ఖుష్బూ, మౌసమ్, కినారా, కితాబ్, మీరా, సహీరా, చత్రన్, అంగూర్, నమ్కీన్, ఇజ్జత్, లిబాన్, లేకిన్” వంటి చిత్రాలతో దర్శకునిగానూ తన బాణీని పలికించారు గుల్జార్. “మాచిస్, హు తు తు” సినిమాలతో నవతరం ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు గుల్జార్. అనేకమంది సంగీత దర్శకులు, ప్రఖ్యాత దర్శకులు గుల్జార్ పాటలతోనే సాగాలని పరితపించేవారు. వారికి నచ్చిన రీతిలో పాటలు రాసి, జనాన్నీ ఆనందింప చేశారు గుల్జార్. పద్మభూషణ్ అవార్డును అందుకున్నారాయన. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం గుల్జార్ కీర్తి కిరీటంలో నిలచింది.
ఆ నాటి అందాల నటి రాఖీని వివాహమాడారు గుల్జార్. వారి కూతురు మేఘన. కొన్ని కారణాల వల్ల గుల్జార్, రాఖీ విడిపోయారు. అయితే కూతురు మేఘన భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని వారు విడాకులు తీసుకోలేదు. మేఘనా గుల్జార్ సైతం తండ్రి బాటలోనే పయనిస్తూ దర్శకురాలిగా మారారు. ఆమె “ఫిల్హాల్, తల్వార్, రాజీ, ఛపాక్” వంటి చిత్రాలతో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నారు. ఇప్పటికీ తన దరి చేరిన అవకాశాల్లో సాహితీవిలువలు వీడకుండా వీనులకు ఆనందం పంచే పాటలు రాస్తున్నారు గుల్జార్. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..