Congress: కాంగ్రెస్ ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’ ఏర్పాటు.. పీకేపై మౌనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది..! ఏ ఎన్నికలు జరిగినా ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు.. సీనియర్లు తిరుగుబాటు చేస్తున్నారు.. గట్టిగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా నిలదీయలేని పరిస్థితి..! అంటే రకరకాల విమర్శలు ఎదుర్కొంటుంది ఆ పార్టీ.. అయితే, వరుస సమావేశాలు, సీనియర్లతో కూడా మంతనాలు జరిపి.. అందరినీ గాడీలోపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీలు.. ఆయన ప్రతిపాదనలపై కీలక చర్చలు సాగుతున్నాయి.. అయితే, పీకే విషయంలో మాత్రం సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తున్నారు.. ఆ ప్రశ్నలను దాటవేస్తున్నారు. ఇవాళ కూడా కొందరు సీనియర్లతో సమావేశం నిర్వహించారు సోనియా గాంధీ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆ పార్టీ నేత సుర్జేవాలా.. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ.. నివేదికను ఏప్రిల్ 21న సోనియా గాంధీకి సమర్పించడం జరిగిందన్న ఆయన.. ఈ నివేదికపై ఈ రోజు కూలంకషంగా చర్చ జరిగిందన్నారు.. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం “ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్”ను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
Read Also: Harish Rao: ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది..
Also Read
- BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
ఇక, మే 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు “నవసంకల్ప్ చింతన్ శిబిర్” నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు రణదీప్ సింగ్ సూర్జేవాలా.. నవసంకల్ప్ చింతన్ శిబిర్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 400 కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని.. వర్తమాన, సాంఘిక, రాజకీయ అంశాలపై చర్చలు సాగనున్నట్టు వెల్లడించారు.. బడుగు బలహీన వర్గాలు, రైతులు, మైనారిటీ, యవత ఎదుర్కుంటున్న సమస్యలపై ఇతర ప్రజా సమస్యలపై కూడా చర్చించనున్నట్టు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ పాత్రపై మీడియా ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా సుర్జేవాలా దాటవేశారు.. ఇక, న్యూఢిల్లీలోని 10 జనపథ్‌లో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, సూర్జేవాలా, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. పీకే సూచించిన విధంగా పునరుజ్జీవన ప్రణాళికను రూపొందించడానికి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్యానెల్ శుక్రవారం తన నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే.. చాలా సూచనలు ఆచరణాత్మకమైనవి మరియు ఉపయోగకరమైనవిగా ఉన్నాయని.. కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. కిషోర్ “బ్రాండ్” అని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలోకి కిషోర్ రాకను వ్యతిరేకించే వారు సంస్కరణల వ్యతిరేకులు అని అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప మొయిలీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!