Nirmala Sitharaman: ప్రజ్వల్ రేవణ్ణపై సాక్ష్యాలు ఉన్నా ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కర్ణాటకలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రజ్వల్‌తో పాటు అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై మహిళ లైంగిక వేధింపులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో పాటు హసన్ జిల్లాలో ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఏడాది కాలంగా కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వొక్కలిగి ఓట్లు కోల్పోతామనే భయంతోనే కాంగ్రెస్ ఈ పనిచేసిందని అన్నారు. అందుకనే కర్ణాటకలో తొలిదశ ఎంపీ స్థానాలకు ఓటింగ్ అయిపోయేంత వరకు మౌనంగా ఉందని ఆమె అన్నారు.
Read Also: Terrorists Attack: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి..
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
మహిళకు వ్యతిరేకంగా జరిగే విషయాలను సహించబోమని కేంద్ర హోం మంత్రి స్పష్టంగా తెలియజేశారని, జేడీయూతో పొత్తు ఉన్నప్పటికీ ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు. దీనిపై దర్యాప్తు జరగాలని మేము స్పష్టం చేశామని ఆమె పూణేలో విలేకరులు సమావేశంలో అన్నారు. రేవణ్ణ చర్యలకు సంబంధించిన ఆధారాలు ఉన్న పెన్‌డ్రైవ్‌ని ఓ డ్రైవర్ కాంగ్రెస్‌కి, కర్ణాటక హోంమంత్రికి అందించినట్లు సమాచారం ఉందని, కానీ వారు ఈ సాక్ష్యాలను సుమారు ఏడాది పాటు నొక్కిపెట్టారని, జేడీఎస్ మాతో పొత్తులో ఉన్నందున మమ్మల్ని టార్గెట్ చేశారని అన్నారు. పెన్‌డ్రైవ్‌లో ఏముందో రాష్ట్రమంత్రులకు తెలుసు కానీ మహిళల భద్రతే తమ ప్రాధాన్యత అని భావించడం లేదని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
వొక్కలిగ వర్గం ఓట్లు పోతాయాని తొలి దశ పోలింగ్ వరకు మౌనంగా ఉండీ, ఇప్పుడు పెద్ద సమస్యగా మార్చి కాంగ్రెస్ తన కపటత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించింది. ఏడాది పాటు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాల నుంచి ప్రజ్వల్ రేవణ్ణను రప్పించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రధానికి లేఖ రాసిందని, కర్ణాటక ప్రభుత్వం కోరుకున్న అన్ని చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేసినట్లు ఆమె చెప్పారు. బీజేపీ సొంతగా 370 సీట్లు, ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి 400 సీట్లు గెలుచుకుంటుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..