congress presidential election triggered a crisis in the Rajasthan: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ వర్గాల మధ్య పొసగడం లేదు. సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో తదుపరి సీఎంగా సచిన్ పైలెట్ బాధ్యతలు చేపడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. సచిన్ పైలెట్ సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు. అయితే అతనికి చెక్ పెట్టేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ ప్రయత్నాలు ప్రారంభించారు.
Read Also: Nikhil: ‘కార్తికేయ 3’ మాములుగా ఉండదంట.. ?
సీఎంగా ఉంటూనే.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని అశోక్ గెహ్లాట్ అనుకున్నప్పటీకీ.. రాహుల్ గాంధీ ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అని స్పష్టం చేయడంతో గెహ్లాట్ ఆశలు అడియాశలు అయ్యాయి. మరోవైపు సచిన్ పైలెట్, రాహుల్ గాంధీతో కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నాడు. ఒకవైపు చివరి ప్రయత్నంగా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేలా ఒత్తడి తీసుకురావడానికి కేరళ వెళ్తున్నారు. ఒక వేళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ ఎన్నికైతే.. ఆయన రాజస్థాన్ సీఎంగా పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
ఇదే జరిగితే సచిన్ పైలెట్ కు చెక్ పెట్టేవిధంగా అశోక్ గెహ్లాట్ పావులు కదుపుతున్నారు. తాను సీఎం పదవి నుంచి తప్పుకుంటే స్పీకర్ సీపీ జోషిని సీఎంగా చేయాలని సిఫారసు చేశారు. 2020లో సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసిన సయమంలో స్పీకర్ జోషి, సీఎం అశోక్ గెహ్లాట్ కు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన జోషి పేరును సిఫార్సు చేశారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని కున్వారియాలో జన్మించిన జోషి సైకాలజీ, న్యాయశాస్త్రాల్లో పట్టా పొందారు. లెక్చరర్ గా ఉన్న జోషి కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా పైకొచ్చారు. 2008లో జోషి రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.