Kartikeya 3: యంగ్ హీరో నిఖిల్- చందూ మొండేటి కాంబోలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. గత నెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ఫుల్ వసూళ్లను రాబడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. వంద కోట్ల క్లబ్ లో చేసిన ఈ సినిమా హిందీలో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక కార్తికేయకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 కూడా హిట్ అందుకోవడంతో ప్రతి ఒక్కరి చూపు కార్తికేయ 3 ఉందా..? లేదా..?ఆ అన్నదానిమీదనే పడింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కార్తికేయ 3 కూడా ఉండనున్నదట. ఇప్పటికే దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ 3 స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో నిఖిల్ కూడా కార్తికేయ 3 ఉందని హింట్ ఇవ్వడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈసారి రాబోయే పార్టీ మాములుగా ఉండదు అన్నట్లు నిఖిల్ చేసిన వ్యాఖ్యలు కార్తికేయ 3 గురించేనని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. అల్లు అరవింద్ నిర్మాణంలో 18 పేజిస్ షూటింగ్ దశలో ఉండగా.. నిఖిల్ కెరీర్ లోనే మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది స్పై. ఈ రెండింటినిపూర్తిచేశాక కార్తికేయ 3 మీద వర్క్ చేయనున్నాడట నిఖిల్. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.