Site icon NTV Telugu

Congress vs BJP: రైల్వే టికెట్లపై ఆపరేషన్‌ సింధూర్‌ ప్రచారం.. బీజేపీపై కాంగ్రెస్ ఆగ్రహం..

Cng

Cng

Congress vs BJP: ఆపరేషన్‌ సింధూర్‌ పేరిట పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది. తాజాగా రైల్వే ఈ- టికెట్లపై ఆపరేషన్‌ సింధూర్‌కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సైనిక చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని ఆరోపించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌ ఎక్స్‌ వేదికగా ఒక ఫొటోను షేర్ చేశాడు. భారతీయ రైల్వేకి సంబంధించిన ఈ-టికెట్‌ పై ప్రధాని మోడీ ఫొటోతో పాటు ఆపరేషన్‌ సింధూర్‌కి సంబంధించిన ప్రకటన దర్శనమిస్తుంది. మోడీ ప్రభుత్వానికి ప్రకటనలపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని ఆయన రాసుకొచ్చారు.

Read Also: Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..

అయితే, ఆపరేషన్‌ సింధూర్‌ను రైల్వే టికెట్లపై ప్రకటన చేయడం దారుణం.. మన సైన్యం పరాక్రమాన్ని ఓ ఉత్పత్తిలా మార్చేశారు అని కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ మండిపడ్డారు. ఇది దేశ భక్తి కాదు.. బేరసారమే అని ఆరోపించారు. రాబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే సైన్యాన్ని ఉపయోగించుకోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇలాంటి పద్ధతులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఈ విషయంపై బీఎస్పీ ఎంపీ కున్వర్‌ డానిష్‌ అలీ సైతం స్పందించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆపరేషన్‌ సింధూర్‌ను ఎన్నికల కోసం అవకాశంగా మార్చుకుంటుందని ఆరోపించారు.

Read Also: Rajiv Yuva Vikasam : ‘రాజీవ్ యువ వికాసం’పై సర్కార్ కీలక నిర్ణయం

ఇక, కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలపై రైల్వే బోర్డు అధికారి దిలీప్‌ కుమార్ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సింధూర్‌ను భారత సైనిక దళాలు సక్సెస్ ఫుల్ గా నిర్వహించినందుకు గర్విస్తున్నాం అన్నారు. దేశం మొత్తం వారి ధైర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తుందన్నారు. భారతీయ రైల్వే ఈ సందేశాన్ని టికెట్లపై హైలెట్‌ చేసి.. ఆపరేషన్‌ సింధూర్‌ను ప్రదర్శించే త్రివర్ణ పతాకాలను అన్ని రైల్వే స్టేషన్లలో ఉంచాలని నిర్ణయించింది అని తేల్చి చెప్పారు. ఈ ఆపరేషన్‌ గురించి దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకోవాలని మేము భావిస్తున్నాం.. అంతే తప్ప ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదని రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్‌ వెల్లడించారు.

Exit mobile version