Nakrekal: రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి ఘటనలతో పోలీసులు తలపట్టుకుంటున్న ఈ రోజుల్లో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసులకు ఓ వింత కేసు ఎదురైంది. సాధారణంగా న్యాయం కోసం వచ్చేవారి కేసులు చట్టబద్ధమైనవే అయినా.. ఈసారి వచ్చిన ఫిర్యాదు అంతకుమించిలా ఉంది. ఆ కేసు వివరాలు వినగానే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆ కేసు ఏంటి..? ఆ కేసుకు పోలీసులు ఎలాంటి పరిశరాన్ని చూపారో చూద్దామా..
Read Also:Delhi: ఢిల్లీలో ఘోరం.. మహిళ, శిశువు హత్య.. నిందితుడు ఎవరంటే..!
నకిరేకల్ కి చెందిన గంగమ్మకు ఎంతో ఇష్టమైన పెంపుడు కోడి ఉంది. ప్రతిరోజూ అది బయట తిరిగి సాయంత్రం ఇంటికే వచ్చేది. అయితే, అదే కోడి పక్కింటి రాకేష్ ఇంటి గడ్డివాము వద్ద గింజలు తినడం మొదలుపెట్టింది. దీన్ని చూసిన రాకేష్ కోపంతో కోడిని కర్రతో కొట్టడంతో అది గాయపడింది. రాకేష్ కొట్టుడుతో.. కోడి కాళ్లు విరిగిపోయాయి. అంతే, ఆ విషయాన్ని గమనించిన గంగమ్మ బోరున ఏడుస్తూ నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
Read Also:UP: లక్నోలో దారుణం.. మహిళా ఉద్యోగినిపై లులు మాల్ మేనేజర్ అత్యాచారం
ఆ పోలీస్ స్టేషన్ లో, నా కోడికి న్యాయం కావాలి. రాకేష్ కర్రతో కొట్టడం వల్ల అది నడవలేకపోతుంది. నాకు డబ్బులు వద్దు. రాకేష్ కి శిక్ష పడాల్సిందే.. అంటూ గంగమ్మ తన ఆవేదనను వ్యక్తం చేసింది. పోలీసులు మొదట ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు. ఊళ్లో మిగిలిన కోళ్లకు ఇదే జరిగితే ఏం అవుతుందన్న ఆవేదనను వ్యక్తపరిచింది. అయితే, పోలీసులు కేసును తీసుకుంటే ఎలా.. వదిలేస్తే ఎలా..? అన్న దానిపై తికమకకు గురైన పోలీసులు చివరికి గ్రామానికి వచ్చి పంచాయతీ నిర్వహిస్తామంటూ గంగమ్మను తెలిపారు. ప్రస్తుతం గంగమ్మను ఇంటికి పంపించి, కోడికి వైద్యం చేయించుకోవాలని సూచించారు.