Emergency: ‘‘ఎమర్జెన్సీ’’పై రాష్ట్రపతి, స్పీకర్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నిరసన..
- ఎమర్జెన్సీపై రాష్ట్రపతి
- స్పీకర్ వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ నిరసన..
- స్పీకర్ వ్యాఖ్యల్ని స్వాగతించిన బీజేపీ..
- ఎమర్జెన్సీతో కాంగ్రెస్‌కి చెక్ పెడుతున్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency: ఇందిరా గాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’కి జూన్ 25, 2024తో 50 ఏళ్ల నిండాయి. అయితే, ఈ అంశంతో కాంగ్రెస్‌ని బీజేపీ టార్గెట్ చేస్తోంది. ఎమర్జెన్సీపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఈ రోజు జరిగిన ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇండియా కూటమి సీనియర్ నేతలు గురువారం లోక్‌సభ స్పీకర్‌తో సమావేశమై..‘‘ఎమర్జెన్సీ చీకటి రోజుల’’ గురించి పార్లమెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యల గురించి నిరసించారు. పార్లమెంట్ విశ్వనీయతను ప్రభావితం చేసే చాలా తీవ్రమైన విషయంగా దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్ పేర్కొంది. పార్లమెంటరీ సంప్రదాయాల అపహాస్యం పట్ల తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేసింది.
బుధవారం స్పీకర్‌గా ఎన్నికైన తర్వా ఓం బిర్లా మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు. అయితే, స్పీకర్ పదవి నుంచి ఇలాంటి ప్రకటన రావడం మంచిది కాదని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన, ఆ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వారి సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని నిన్న స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెన్‌తో పాటు దాని మిత్రపక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
Read Also:Yogi Adityanath: ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోంది.. ‘సెంగోల్’ వివాదంపై యోగి ఆదిత్యనాథ్
అయితే, ఎమర్జెన్సీపై స్పీకర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్రమోడీ స్వాగతించారు. ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించినందుకు, ఆ సమయంలో అతిక్రమణలను ఎత్తిచూపినందుకు, ప్రజాస్వామ్యం గొంతు నొక్కే విధానాలను ప్రస్తావించినందుకు తాను సంతోషిస్తున్నాని ప్రధాని అన్నారు. భారత ప్రజస్వామ్యానికి ఎమర్జెన్సీ నల్లమచ్చ, రాజ్యాంగాన్ని ఎలా రద్దు చేశారో, దేశాన్ని ఎలా జైలుగా మార్చారో, ప్రజాస్వామ్యాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారో కొత్త తరం మరిచిపోదని ప్రధాని అన్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ.. ఎమర్జెన్సీ రాజ్యాంగంపై అతిపెద్ద, ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. దేశం అటువంటి రాజ్యాంగేతర శక్తులపై విజయం సాధించిందని ఆమె అన్నారు. దీంతో అధికార బీజేపీ ఈ వ్యాఖ్యలపై హర్షధ్వానాలు చేయగా, ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఇండియా కూటమి ఎంపీలు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణస్వీకారం చేయడం, దేశంలో బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించిందని ఇండియా కూటమి పదేపదే విమర్శలు చేస్తున్న క్రమంలో ‘ఎమర్జెన్సీ’ అంశంతో కాంగ్రెస్‌ని బీజేపీ ఇరుకున్న పెడుతోంది.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!