ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కూడా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పుణ్యస్నానం చేశారు.
అనంతరం డీకే.శివకుమార్ మీడియాతో మాట్లాడారు. మహా కుంభమేళాలో ఏర్పాట్లు బాగున్నాయంటూ కితాబు ఇచ్చారు. ఇది చాలా పవిత్రమైనదని.. ప్రతి వారి జీవితంలో చారిత్రాత్మక క్షణం అని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లో అన్ని ఏర్పాట్లు బాగున్నాయంటూ నిర్వాహకులకు డీకే.శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: GHMC: నేటి నుండి జిహెచ్ఎంసిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ..
భక్తిలో భాగంగానే కుంభమేళాను సందర్శించినట్లుగా తెలిపారు. ఇక ఏర్పాట్లపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఎవరైనా ఏమి చెప్పాలనుకున్నా.. ఇది మన ధర్మం, ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. కనుక వ్యక్తిగత నమ్మకాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేని స్పష్టం చేశారు. కుంభమేళాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సందర్భాను సారంగా చేసిన వ్యాఖ్యలు అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Tirupati Laddu Ghee Adulteration Case: శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి.. నలుగురి అరెస్ట్..
ఇక కుంభమేళాలో స్నానం చేశాక.. ఇందుకు సంబంధించిన ఫొటోలను డీకే.శివకుమార్ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘హర హర మహాదేవ్! ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నేను నా కుటుంబంతో కలిసి పాల్గొన్నాను. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశాను. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళాలో పాల్గొనే అవకాశం లభించడం నాకు నిజంగా సంతోషంగా ఉంది’’ అని డీకే శివకుమార్ అన్నారు.
ಹರ ಹರ ಮಹಾದೇವ!
ಉತ್ತರ ಪ್ರದೇಶದ ಪ್ರಯಾಗ್ ರಾಜ್ನಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಮಹಾ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಕುಟುಂಬ ಸಮೇತ ಪಾಲ್ಗೊಂಡು, ತ್ರಿವೇಣಿ ಸಂಗಮದಲ್ಲಿ ಪುಣ್ಯಸ್ನಾನ ಮಾಡಿದೆ. 144 ವರ್ಷಗಳಿಗೊಮ್ಮೆ ನಡೆಯುವ ಮಹಾ ಕುಂಭದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ್ದು ನಿಜಕ್ಕೂ ಖುಷಿ ತಂದಿದೆ. pic.twitter.com/LhwwJ0hvpK
— DK Shivakumar (@DKShivakumar) February 9, 2025