బీహార్‌లో ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న ముగియనుంది. ఈ యాత్రలో భాగంగా దుర్భంగా పట్టణంలో నిర్వహించిన సభలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను బీజేపీ, మిత్రపక్షాలు ఖండించాయి. నితీష్ కుమార్, అమిత్ షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తీవ్రంగా ఖండించారు.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్‌లో చేయండి.. ప్రపంచం కోసం చేయండి.. టోక్యో ఎకనామిక్ ఫోరంలో మోడీ పిలుపు
తాజాగా పాట్నాలో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో కొట్టుకుని బీభత్సం సృష్టించారు. తలలు పగిలేలా రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరి దాడి చేశారు.
ఇది కూడా చదవండి: Survey Predicts: లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే
ఇక మోడీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తపై బీజేపీ ఫిర్యాదు చేసింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మోడీని హిందీలో దూషిస్తున్నట్టుగా వీడియోలు దర్శనమిచ్చాయి. ఇక నిందితుడు సింగ్వారాలోని భాపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ ఇప్పటివరకు స్పందించలేదు.
#WATCH | Patna, Bihar: BJP and Congress workers clash as the former staged a protest against the latter in front of the Congress office. pic.twitter.com/GDUxM0JgyB
— ANI (@ANI) August 29, 2025
#WATCH | Patna, Bihar: BJP and Congress workers clash as the former staged a protest against the latter in front of the Congress office. pic.twitter.com/p1tt2bytzD
— ANI (@ANI) August 29, 2025