CM Revanth Reddy: రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని.. 20 ఏళ్లు ఆయనే ఉంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌తో పాటు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజా ఎంపీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అని అన్నారు. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేశారని, గత 20 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆయన కాకుంటే ఇంకెవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు.
ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, వయనాడ్ నుంచే ఆయన 20 ఏళ్లుగా ప్రధానిగా ఉంటారని, వయనాడ్ ప్రజలు ఎంపీ కోసం ఓటు వేయడం లేదని, ప్రధాని పదవి కోసం వేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ 10 ఏళ్లు వారణాసి నుంచి ప్రధానిగా ఉంటే, రాహుల్ గాంధీ 20 ఏళ్లు వయనాడ్ నుంచి ప్రధానిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలు లేకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావని ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. నరేంద్రమోడీ, ఈవీఎంలు ఉన్నంత వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదని బీజేపీ నేతలే చెబుతున్నారని ఆరోపించారు.
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
Read Also:Amit Shah: మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం..
ఈవీఎంలపై తమకు అనుమానం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈవీఎంలు తీసేయడానికి ప్రధాని మోడీకి ఎందుకు భయమవుతోందని ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎందుకు ఎన్నికలు జరపడం లేదని అన్నారు. ఈవీఎంలతో ప్రధాని మోడీకి ఏం సంబంధం ఉందని, బీజేపీకి ఎందుకు భయమవుతోందని అడిగారు. ప్రపంచం మొత్తం పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తుంటే, భారత్‌లోనే ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని అన్నారు. మీరు పేపర్ బ్యాలెట్ ఉపయోగించి పరీక్ష నిర్వహించాలని, తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, పేపర్ బ్యాలెట్ ఉపయోగించడం ద్వారా నిజమేంటో తెలుస్తుందని ఆయన అన్నారు.
- Tags
- bjp
- CM Revanth Reddy
- congress
- evm
- Kerala
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..