Failure To Deploy Full Flaps May Have Caused Plane Crash In Nepal: నేపాల్ విమాన ప్రమాదం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లైట్ క్రూతో పాటు మొత్తం 72 మంది ఈ ప్రమాదంలో మరణించారు. మరికొన్ని నిమిషాల్లో ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ కావాల్సిన విమానం అనూహ్యంగా కుప్పకూలింది. జనవరి 15న పొఖారాలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో కావల్సిన యతి ఎయిర్ లైన్ విమానం, ఎయిర్ పోర్టుకు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
ఇప్పటికీ ఈ విమానానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించే బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకుని విశ్లేషణకు పంపారు. అయితే ఈ ప్రమాదానికి సరిగ్గా ఫ్లాప్స్ ను వాడకపోవడమే అని తెలుస్తుంది. విమానం రెక్కల వెనక ఉండే ఫ్లాప్స్ విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కీలకం. వీటిని సరిగ్గా ఉపయోగించి పైలెట్లు విమానాన్ని నియంత్రిస్తుంటారు. ల్యాండింగ్ వస్తున్న సమయంలో విమానం తక్కువ వేగంతో ఉంటుంది. ఇలాంటి సమయంలో విమానానికి గాలిలో ‘స్టాల్’ కాకుండా ఫ్లాప్స్ రెక్కల వెనక పూర్తిగా కిందకు ఉంటాయి.
Read Also: Ap High Court: ఇద్దరు పంచాయతీ అధికారులకు జైలుశిక్ష. జరిమానా
అయితే విమానం కూలే సమయంలో భారతీయ ప్రయాణికులు జైశ్వాల్ ఫేస్ బుక్ లైవ్ పెట్టాడు. ఆ సమయంలో విమానం రెక్కల వద్ద ఫ్లాప్స్ సరిగ్గా సెట్ చేసి లేవని తేలుస్తోంది. ఈ కారణంగానే విమానం గాలిలో నిలిచిపోయినట్లు తెలుస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పైలెట్లు గందరగోళానికి గురై ల్యాండింగ్ చెక్ లిస్టును సరిగ్గా అమలు చేయలేదని తెలుస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఏటీఆర్ కెప్టెన్ కుమార్ పాండే.. ఫ్లైట్ కూలిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విమానం ఒక వైపు రెక్కపై ఉన్న ఫ్లాప్స్ సరిగ్గా లేవని స్పష్టంగా చూడవచ్చని అన్నారు.
సాధారణంగా ల్యాండింగ్ సమయంలో 160 నాట్లు లేదా గంటకు 296 కిలోమీటర్ల వేగంతో, పైలట్ ల్యాండింగ్ గేర్ వేస్తారు. ఈ దశలో, ఫ్లాప్‌లను 15 డిగ్రీల వద్ద అమర్చాలి. వేగం గంటకు 150 నాట్లు లేదా 277 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఫ్లాప్‌లను 30 డిగ్రీల వద్ద సెట్ చేయాలి. అయితే ప్రమాదం సమయంలో సమయంలో ఫ్లాప్స్ కేవలం 15 డిగ్రీల వద్దే ఉన్నాయని దీంతోనే విమానం అదుపుతప్పి ఉంటుందనే తెలుస్తోంది. యతి విమాన ప్రమాదంపై ఫ్రాన్స్ కు చెందిన తొమ్మిది మంది సభ్యులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఐదుగురితో విచారణ కమిటీని నేపాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.