Tamil Nadu CM: కేంద్ర ఆర్థిక మంత్రికి క్షమాపణలు చెప్పిన జీఎస్‌టీ గురించి ప్రశ్రలు అడిగిన రెస్టారెంట్ యజమాని చెప్పిన వీడియో వైరల్ కావడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు (శనివారం) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీపై న్యాయమైన డిమాండ్లు చేసినందుకు కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని పేర్కొన్నారు. అలాగే, జీఎస్‌టీపై మాట్లాడిన వ్యక్తికి ఏమి జరిగిందో చూస్తే చాలా నిరుత్సాహంగా ఉందన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వ సహకారం ఇంకా అందలేదు.. నిన్న ( శుక్రవారం) కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాకు రుణ సాయం అందిందని చెప్పారని.. కానీ, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేంద్ర సర్కార్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్టాలిన్ తేల్చి చెప్పారు.
Read Also: Andhra Pradesh: ఏపీ సర్కార్ చొరవ.. కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి బాధితురాలు
కాగా, కోయంబత్తూరులో గల శ్రీ అన్నపూర్ణ హోటల్ యజమాని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు ఉన్న వీడియోను తమిళనాడు రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం తలెత్తింది. రెస్టారెంట్ యజమాని, ఆర్థిక మంత్రి మధ్య జరిగిన సంభాషణను బహిరంగపరచినందుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై పార్టీ తరపున క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా గోప్యతను ఉల్లంఘించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం.. అన్నపూర్ణ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ యజమాని శ్రీనివాసన్‌కు క్షమాపణలు చెప్పారు.
Read Also: Inspirational Story: రైల్వే స్టేషన్‌లో కూలీ టూ ఐఏఎస్.. శ్రీనాథ్ విజయగాథ..
ఇక, తమిళనాడు హోటల్ యజమానుల సంఘం అధ్యక్షుడు కూడా అయిన శ్రీనివాసన్ సెప్టెంబరు 11న కోయంబత్తూరులో ఆర్థిక మంత్రి హాజరైన సమావేశంలో జీఎస్‌టిపై సమస్యలను లేవనెత్తారు. స్వీట్, మసాలా ఆహారంపై పన్ను విధించడంలో ఉన్న వ్యత్యాసాలను చూపించారు. తీపిపై ఐదు శాతం జీఎస్‌టి విధించగా.. సావరీస్‌పై 12 శాతం, క్రీమ్‌తో కూడిన బన్స్‌పై (బన్స్‌పై జీఎస్‌టి లేదు)18 శాతం విధించడంతో కస్టమర్లు తరచూ ఫిర్యాదు చేస్తున్నారని హోటల్ యజమాని శ్రీనివాసన్ పేర్కొన్నారు.
Sree Annapoorna is a famous vegetarian restaurant chain in Coimbatore. On Wednesday, the owner of the restaurant Mr. Srinivasan attended an event with FM @nsitharaman and asked a question about the anomalies in GST very very politely.
"The problem is that GST is applied… pic.twitter.com/FNldzP0hu7
— Congress Kerala (@INCKerala) September 13, 2024