ప్రధాని మోడీ-పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గురువారం ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వమే లక్ష్యంగా మోడీ విమర్శలు గుప్పించారు. మమతను ఉద్దేశించి ‘నిర్మంత’ అనే మాటను ఉపయోగించారు. హిందీలో క్రూరత్వం అని అర్థం వచ్చే విధంగా ‘నిర్మంత’ అనే మాటను ప్రధాని మోడీ ఉపయోగించారు. మమత శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని.. పౌరుల భద్రతను విస్మరించిందని ఆరోపించారు. గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముర్షిదాబాద్, హల్డాలో హింస చెలరేగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని మోడీ విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: కడప తెలుగుదేశం పార్టీ అడ్డా.. వారికి ప్రజలే బుద్ధి చెప్పారు..
మోడీ విమర్శలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ మాదిరిగా ‘ఆపరేషన్ బెంగాల్’ చేస్తామని మోడీ వ్యాఖ్యానించడంపై ధ్వజమెత్తింది. ఈ వ్యాఖ్య బెంగాల్ ప్రజలను అవమానించడమేనన్నారు. ప్రతిపక్షం కేంద్రానికి మద్దతుగా విదేశాల్లో అంతర్జాతీయ వేదికలపై ఆపరేషన్ సిందూర్ గురించి టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ గొంతు వినిపిస్తుంటే.. మోడీ మాత్రం రాజకీయ హోలీ ఆడుతున్నారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Sreeleela: ‘ఉస్తాద్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీలీల
అంతర్జాతీయ వేదికపై కేంద్రాన్ని సమర్థిస్తుంటే మోడీ మాత్రం.. బెంగాల్‌ను కించపరచడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలియదా? అని ప్రశ్నించారు. మోడీ.. బెంగాల్ మహిళలను అగౌరవపరిచారని.. తాము మాత్రం ప్రతి ఒక్కరినీ గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని పణంగా మాత్రం పెట్టమని చెప్పారు. ‘ఆపరేషన్ బెంగాల్’ అని చెప్పడానికి మోడీకి ఎంత ధైర్యం ఉండాలి? అదే జరిగితే రేపే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు నిర్వహించండి.. అందుకు సిద్ధంగా ఉన్నట్లు మమత ప్రకటించారు.
మమత సవాల్..
ఇక బెంగాల్ సమస్యలపై లైవ్ టీవీ చర్చకు మోడీ సిద్ధమా? అని మమత సవాల్ విసిరారు. ఆపరేషన్ సిందూర్‌పై కేంద్రం రాజకీయ నాటకాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షమేమో జాతీయ ప్రయోజనాలు కాపాడానికి ప్రయత్నిస్తుంటే.. మోడీ ఏమో రాజకీయ డ్రామాలు ఆడడం ఏంటి? అని నిలదీశారు. గురువారం మోడీ ప్రసంగాన్ని విని షాక్ అయినట్లు చెప్పుకొచ్చారు. అలాంటి మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం అన్నారు. కేవలం రాజకీయ మైలేజ్ కోసమే కేంద్రం ఆపరేషన్ సిందూర్ కోడ్ నేమ్ ఉపయోగిస్తోందని ఆరోపించారు. అభిషేక్ బెనర్జీ దేశం కోసం స్వరాన్ని వినిపిస్తుంటే.. కేంద్రమేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడంలో బిజీగా ఉందంటూ ఫైరయ్యారు.
ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఏం జరిగిందో మీకు తెలియదా? మీరు సిగ్గుపడటం లేదా? వీధిలో నీలి చిత్రం ప్రదర్శించినట్లుగా.. ఓ వ్యక్తి హైవేపై అశ్లీల చర్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ కాలేదా? అని మోడీని మమతా నిలదీశారు.
మోడీ ఏం మాట్లాడారంటే..
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్‌పై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందిన తర్వాత పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. హింస చెలరేగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ముర్షిదాబాద్, మాల్డాలో జరిగిన హింసను ఉద్దేశించి మమతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందీలో క్రూరత్వం అని అర్థం వచ్చేలా మమతను ‘నిర్మంత’ అనే మాటను ఉపయోగించారు. ‘క్రూరత్వం లేదా ఉదాసీనతకు ప్రతీక అని అర్థం వస్తుంది. శాంతిభద్రతలను కాపాడటంలో మమత సర్కార్ పూర్తిగా విఫలమైందని మోడీ ధ్వజమెత్తారు. పౌరుల ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.
గురువారం పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇండియా… విక్షిత్ భారత్‌గా మారాలంటే.. పశ్చిమ బెంగాల్‌ను కూడా విక్షిత్ పశ్చిమ బెంగాల్‌గా మార్చడం ముఖ్యమని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు కొత్త శక్తిని నింపాల్సిన అవసరం ఉందని.. జ్ఞానం.. విజ్ఞాన కేంద్రంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.