Supreme Court Key Comments on Freebies: రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై బుధవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలపై వాడీవేడీ చర్చ జరిగింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం ఉచితాలపై పలు వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఉచిత పథకాలకు వ్యతిరేకంగా తన వాదనలను కొనసాగింది. అయితే ‘ ఉచితాలు’ అంటే ఏమిటని సుప్రీం ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు, న్యాయవాది అయిన అశ్విని…
జస్టిస్ యూయూ లలిత్ పేరును తన వారసుడిగా సిఫార్సు చేశారు సీజేఐ ఎన్వీ రమణ.. దీంతో, 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ యూయూ లలిత్.
దేశంలో వివాదాస్పదం అయిన హిజాబ్ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. వచ్చే వారం నుంచి దీనిపై విచారణ చేపడుతామని, వచ్చేవారం లిస్ట్ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కర్ణాటక హైకోర్టు, స్కూళ్లు, కాలేజీల్లోకి హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో సుప్రీం…
దేశ అత్యున్నత న్యాయస్థానం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే రోజు ఏకంగా 44 తీర్పులిచ్చింది. ఇది ఈమధ్య కాలంలో ఒక రికార్డు కావటం విశేషం. మే నెల 23 నుంచి జూలై 10 వరకు సుప్రీంకోర్టుకు సమ్మర్ హాలిడేస్ కాగా మొన్న 11వ తేదీన తిరిగి ప్రారంభమైంది. ఆ రోజే ఈ అత్యధిక తీర్పులు వెలువడటం గమనార్హం. 19 రోజుల పాటు సెలవుల్లో ఉండటంతో వివిధ అంశాలపై లోతుగా అధ్యయనం చేయటానికి, జడ్జిమెంట్లను రాతపూర్వకంగా ఇవ్వటానికి తీరిక…
హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు మరోసారి నిరాకరించింది సుప్రీంకోర్టు.. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.. విద్యార్థుల తరఫు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థులకు వార్షిక పరీక్షలో సమస్య ఏర్పడిందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.. విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేరు మరియు ఒక సంవత్సరం నష్టపోలేరు కాబట్టి సమస్య అత్యవసం అన్నారు.. దీనిపై ప్రధాన…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వరంగల్ జిల్లాలో రెండు రోజులు పర్యటించారు. మొదటి రోజు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రెండవ రోజు వరంగల్ నగరంలో చరిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడిని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కొత్తగా నిర్మించిన 10 కోర్టుల భావన సముదాయాన్ని ప్రారభించారు. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్దరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాయి.. రెండు రోజుల పర్యటన కోసం గురువారం రోజు తిరుపతికి వచ్చిన ఆయన.. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని మొదట దర్శించుకున్నారు.. ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు.. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.. ఇక, ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చక్రస్నానం ఘట్టంలో పాల్గొన్న ఆయన.. మూల విరాట్ అభిషేకం…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. శ్రీవారి దర్శనార్థం రేపు తిరుమలకు రానున్నారు చీఫ్ జస్టిస్… మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్న ఆయన.. ఆ తర్వాత తిరుచానూరుకు వెళ్లనున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి తిరుమలకు చేరుకుంటారు.. ఇక, ఎల్లుండి (శుక్రవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఎన్వీ రమణతో పాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా కూడా తిరుమలకు…
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. న్యాయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఇప్పటికే ఒకేసారి సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందిని నియమించి కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు దేశంలోని 12 హైకోర్టుల్లో ఏకంగా 68 నియమించేందుకు సిద్ధమయ్యారు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. ఒకేసారి 68 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇది భారత న్యాయ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.. చీఫ్…
తీర్పుల సందర్భంగా.. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలోనూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఇప్పుడు ఆయన.. ఈ మధ్యనే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరుపై స్పందిస్తూ.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని వ్యాఖ్యానించారు.. ఒకప్పుడు సభలో మొత్తం లాయర్లే ఉన్న సమయంలో పార్లమెంట్ ఎంతో హుందాగా నడిచేదంటూ ఆసక్తికర…