భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ యూయూ లలిత్ ఆగస్టు 27న బాధ్యతలు స్వీకరించనున్నారు.
జస్టిస్ యూయూ లలిత్ పేరును తన వారసుడిగా సిఫార్సు చేశారు సీజేఐ ఎన్వీ రమణ.. దీంతో, 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ యూయూ లలిత్.