Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోతమోగింది. గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో సీనియర్ నక్సలైట్‌తో సహా 10 మంది నక్సల్స్ హతమయ్యారు. మరణించిన వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నారు. ఇతడిని మోడెం బాలకృష్ణ అని కూడా పిలుస్తారు.
మావోయిస్టుల ఏరివేతలో చారిత్రాత్మక విజయం సాధించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నిర్వహించిన ‘‘ఆపరేషన్ బ్లాక్‌ఫారెస్ట్’’లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చడంపై ఎక్స్ ట్విట్టర్ వేదికగా అమిత్ షా స్పందించారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా దక్షిణ అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 7 మంది నక్సలైట్లు హతమయ్యారు. భద్రతా బలగాలు ఈ ఎన్‌కౌంటర్ లో నక్సలైట్లకు సంబంధించిన రెడ్ మిలిటెంట్ల సెంట్రల్ కమిటీలో భాగమైన టాప్ నక్సలైట్ లిడార్ స్థాయిలో ఉన్న మృతదేహంతో సహా వారందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ పై భద్రతా బలగాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌కౌంటర్ ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైందని, నక్సలైట్లతో…