Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోతమోగింది. గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో సీనియర్ నక్సలైట్‌తో సహా 10 మంది నక్సల్స్ హతమయ్యారు. మరణించిన వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నారు. ఇతడిని మోడెం బాలకృష్ణ అని కూడా పిలుస్తారు.