దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. ఒక ప్రైవేటు వీడియోను అడ్డంపెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. 32 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ (CA) దగ్గర 18 నెలల్లో ఏకంగా రూ.3 కోట్లు గుంజుకున్నారు. నిందితులు అంతటితో ఆగకుండా నిత్యం వేధిస్తుండగా తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు.