One Nation One Election: బీజేపీ హామీ ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’’ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత హాయాంలోనే బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనుంది. దీంతో త్వరలోనే ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Lok Sabha polls: విడిపోయిన మిత్రులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఏన్డీయే కూటమి, అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తో్ంది. పాత మిత్రులను అక్కున చేర్చుకుంటోంది. ఇప్పటికే పాత మిత్రలైన తెలుగు దేశం పార్టీ, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలు ఏన్డీయేలోకి చేరాయి.