Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం యావత్ దేశాన్ని బాధించింది. భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరొందిన మన్మోహన్ సింగ్ మరణంపై దేశంలోని ప్రముఖ నాయకులతో పాటు, ప్రపంచదేశాధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన అంత్యక్రియలకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ హాజరయ్యారు. అంతకుముందు భూటాన్ రాజధాని థింఫులోని బౌద్ధ ఆశ్రమంలో మన్మోహన్ సింగ్ కోసం ప్రార్థనలు నిర్వహించారు.
Rahul Gandhi: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలంపై వివాదం నెలకొంది. మాజీ ప్రధానిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. స్మారక చిహ్నం నిర్మించడానికి కేటాయించిన స్థలంలో ఆయన అంత్యక్రియలు చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనని తిరస్కరించడం ద్వారా బీజేపీ మన్మోహన్ సింగ్‌ని అవమానించిందని రాహుల్ గాంధీ శనివారం అన్నారు. ‘‘భారతదేశ గొప్ప కుమారుడు, సిక్కు సమాజానికి మొదటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ…
Union Cabinet: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్యాబినెట్ సంతాపం తెలపనుంది. అలాగే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు (డిసెంబర్ 28) ఢిల్లీలో జరగనుండగా.. కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించబోతున్నట్లు తెలిపింది.