Telangana: తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ను 3.64 శాతం పెంచుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ జీతంతో పాటు ఈ పెరిగిన డీఏ చెల్లించనున్నారు. 2022 జులై 1 నుండి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ…
ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తామని.. ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ ప్రకటిస్తామని వెల్లడించారు.
పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు అన్నదాతలకు కేంద్ర శుభవార్త తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్, రబీ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు వంటి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్‌ఏలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా వీఆర్‌ఏలు ఎదురుచూస్తున్న అంశంపై ఇవాళ శుభవార్త అందించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తొలగించిన ఓ ఆర్ధిక ప్రయోజనాన్ని వారికి తిరిగి కల్పించడంతో పాటు దాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యాన్ని (డీఏ) మూడు శాతం పాయింట్లు పెంచి ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి 45 శాతానికి పెంచే అవకాశం ఉంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు అదే తరహాలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యాన్ని పెంచుతున్నాయి.
కేంద్రంలోని మోదీ సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Centre likely to hike dearness allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం. మరోసారి ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ) పెంచే అవకాశం ఉంది. త్వరలోనే మరో 4 శాతం డీఏను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 38శాతం డీఏ ఉంది.