HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్యోగుల జీతాల అంశంపై స్పష్టతనిచ్చారు. ఇటీవల జారీ చేసిన G.O ప్రకారం ఒక్క స్కేల్ జీతం విడుదల చేసినప్పటికీ, హైడ్రా లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఆ అంశాన్ని తాము పూర్తిగా వివరించడంతో వారికి భరోసా కలిగిందని తెలిపారు. అలాగే మార్షల్స్ జీతాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా…
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు…
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతూనే ఉద్యోగుల కష్టాలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. “మీ పాలనలో చిరు ఉద్యోగుల దుస్థితి దారుణంగా తయారైంది. వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు,” అని హరీష్ రావు పేర్కొన్నారు.…
CM Revanth Reddy : రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టిందన్నారు.…
Intel : ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి.
Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా కానుకను అందించనుంది. ఏడో వేతన కమిషన్ ప్రకారం కేంద్రం త్వరలో డీఏ ప్రకటించనుందని ఓ నివేదిక ద్వారా స్పష్టమైంది. ఇప్పటికైతే అధికారికంగా వెల్లడి కాకపోయినా సెప్టెంబర్ చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అమలు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో మరో 4 శాతం పెంచి మొత్తం 38 శాతానికి చేరుస్తారని అంచనాలు ఉన్నాయి. త్వరలో…