త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. వచ్చే ఏడాది అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం కేబినెట్‌ను విస్తరించబోతున్నది. కొత్తగా 27 మందికి చోటు లభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ కేబినెట్‌లో ఆరాష్ట్రానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది.
Read: సోదరులతో సల్మాన్ డ్యాన్స్… రేర్ వీడియో వైరల్
కేబినెట్‌లో కొన్ని బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. కొందరు తమ శాఖలతో పాటుగా అదనంగా మరికొన్ని శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా శాఖల నిర్వాహణ మంత్రులకు కొంత భారంగా మారింది. కొత్తగా కేబినెట్‌లోకి 27 మందిని తీసుకుంటే అందులో ఎక్కువమంది కొత్తవారే ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జ్యోతిరాధిత్య సింధియాకు కేబినెట్‌లో బెర్త్ ఖాయం అయిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, యూపీకి చెందిన వరుణ్ గాంధీ, స్వతంత్రదేవ్ సింగ్, పంకజ్ చౌదరీ, అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్‌కు మంత్రివర్గంలో అవకాశం రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.