గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రపంచంలోని 70 శాతం మంది జనాభా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ప్రపంచం మెల్లిగా బయటపడుతున్నది. కొన్ని దేశాల్లో మినహా చాలా చోట్ల కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో సైతం కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడమే ఇందుకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. కరోనా కంట్రోల్‌లోకి రావడంతో ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ప్రజలు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను పెద్ద…