Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ కొన్ని ఎయిర్ నష్టాలను చవిచూసినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ శనివారం అంగీకరించారు. అయితే, భారత్‌కి చెందిన 6 ఫైటర్ జెట్స్‌ని కూల్చేశామనే పాకిస్తాన్ వాదనల్ని మాత్రం ఆయన తిరస్కరించారు. అవి పూర్తిగా తప్పు అని చెప్పారు. తొలిసారిగా, సైన్యం భారత్ కొన్ని విమానాలు కోల్పోయినట్లు ధ్రువీకరించింది. పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణల్లో మొదటి రోజు ఎయిర్ నష్టాలను చవిచూసిన తర్వాత భారత్ తన వ్యూహాలను మార్చుకుందని,
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో నష్టాల గురించి తొలిసారిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ స్పందించారు. నాలుగు రోజులు సంఘర్షణ అణుయుద్ధం స్థాయికి చేరుకోలేని ఆయన చెప్పారు. భారత ఫైటర్ జెట్స్ కూలిపోయాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ విషయం ఏంటంటే, జెట్ కూలిపోవడం కాదు, కానీ అవి ఎందుకు కూలిపోతున్నాయనేదే ముఖ్యం’