Operation Valentine OTT: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’.. ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది..
ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. పుల్వామా అటాక్, దానికి భారతదేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్.. వంటి రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మన తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి అద్భుతంగా చూపించారు.. సినీ ప్రేక్షకులను ఈ అంశం బాగా ఆకట్టుకుంది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..
Also Read
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ దక్కించుకుంది. నాలుగు వారాల తర్వాత తెలుగు భాషలో అమెజాన్ లో ఆపరేషన్ వాలంటైన్ స్ట్రీమింగ్ అవ్వనుంది. అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీకి రానుంది. హిందీలో మాత్రం రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని సమాచారం. ఇప్పుడు థియేటర్స్ లో కేవలం తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం తెలుగు, హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కూడా విడుదల కాబోతుందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!