Rameshwaram Cafe: బెంగళూర్‌లో ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తి రెస్టారెంట్‌లో బ్యాగ్ వదిలిసి వెళ్లాడు. అందులో ఉన్న బాంబు పేలినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధ్రువీకరించారు. ఐఈడీని పేల్చేందుకు టైమర్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.