కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో విద్యా సంవత్సరంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కొన్ని పరీక్షలు రద్దు అయితే.. మరికొన్ని వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చాయి… అయితే, 2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మార్పులు చేసింది.. రెండు విభాగాలుగా విభజించినట్లు వెల్లడించింది సీబీఎస్‌ఈ.. 50 శాతం సిలబస్ చొప్పున రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో తొలి విడత పరీక్షలు, వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో రెండో విడత బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.. 10, 12వ తరగతులకు టెర్మ్‌ల వారీగా సిలబస్‌ను ఈ నెలాఖరున ప్రకటిస్తామని వెల్లడించిన సీబీఎస్‌ఈ.. విద్యార్థుల అంతర్గత అంచనా, ప్రాజెక్ట్ వర్స్‌ను మరింత విశ్వసనీయంగా నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నట్టు తెలిపింది.. 9,10 తరగతులకు ఇంటర్నల్ పరీక్షలు, 11,12 తరగతుల కు కూడా ఇంటర్నల్ అసెస్మెంట్ ఉండనున్నాయి.. 9, 10 తరగతులకు 3 పిరియాడిక్ ఇంటర్నల్స్.. 11, 12 తరగతుల కు యూనిట్ టెస్ట్ లు పెట్టనున్నారు.. దీనికి అనుగుణంగా స్కూల్స్ విద్యార్థుల ప్రొఫైల్ తయారు చేయాలని.. బోర్డ్ వెబ్‌సైట్‌లో ఇంటర్నల్ అసెస్మెంట్స్ ని అప్లోడ్ చేయాలని పేర్కొంది సీబీఎస్‌ఈ.