Cardiologist Gaurav Gandhi Dies Of Heart Attack At 41 Despite Normal ECG: గుజరాత్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 16 వేల గుండె ఆపరేషన్లను విజయవంతంగా చేసిన ఆయన.. కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. ఎప్పట్లాగే సోమవారం తన పని పూర్తి చేసుకొని, జామ్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకున్న ఆయన.. కుటుంబ సభ్యులతో కాసేపు సమయం గడిపారు. కాసేపయ్యాక బాత్రూంకి వెళ్తున్న క్రమంలో.. గౌరవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో.. తన భర్త బాత్రూం వద్ద పడి ఉండటాన్ని గమనించిన గౌరవ్ భార్య, వెంటనే భర్తను దగ్గరలోని జీజీ ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు కానీ, 45 నిమిషాల తర్వాత మృతి చెందారు. గౌరవ్‌కి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌరవ్ మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని గౌరవ్.. ఇలా గుండెపోటుతో తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడంతో కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఒక్క కుటుంబ సభ్యులనే కాదు.. జామ్‌నగర్ వాసులు కూడా ఈయన మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు.
Geethanjali Iyer: మొట్టమొదటి న్యూస్ రీడర్.. ‘దూరదర్శన్’ గీతాంజలి మృతి
డాక్టర్ గౌరవ్ గాంధీ మృతిపై జీజీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నందినీ దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘జూన్ 6వ తేదీన అర్థరాత్రి 2 గంటల సమయంలో గౌరవ్ తన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పారు. అప్పుడు ఆయన శారదా ఆసుపత్రికి వెళ్లి, అక్కడ ఈసీజీ చేయించుకున్నారు. అందులో కార్డియోగ్రామ్ సాధారణంగానే వచ్చింది. దాంతో.. తనకు ఛాతీనొప్పి రావడానికి కారణం యాసిడిటీ అయ్యుండొచ్చని గౌరవ్ భావించి, అందుకు ఇంజెక్షన్ తీసుకున్నాడు. తన ఆరోగ్య పరిస్థితిలో ఏమైనా మార్పులొస్తాయన్న ఉద్దేశంతో.. అరగంటసేపు ఆసుపత్రిలోనే సమయం గడిపాడు. ఎలాంటి మార్పు గమనించకపోవడంతో.. గౌరవ్ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే.. ఉదయం 6 గంటల సమయంలో అతడు బాత్రూం వద్ద కుప్పకూలిపోయి ఉండటాన్ని భార్య గమనించింది. కుటుంబ సభ్యులు వెంటనే జీజీ ఆసుపత్రికి గౌరవ్‌ని తీసుకొచ్చారు. మేము అతడ్ని వెంటిలేటర్‌పై చికిత్స అందించాం. కార్డియోగ్రామ్ చూస్తే, గుండె పనితీరు సరిగ్గా లేదని తేలింది. మేము 45 నిమిషాల పాటు సీపీఆర్ ప్రయత్నించాం. అయినా అతడ్ని బతికించలేకపోయాం. వైద్యపరంగా, దీనిని కార్డియాక్ అరెస్ట్ అని మేము భావిస్తున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు.
Suresh Gopi: బాడీ షేమింగ్ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో డాటర్