ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న కొరకు మొత్తం ఐదు మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను తాజాగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న అవార్డులను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కార్యక్రమానికి అనారోగ్య సమస్యల కారణంగా ఉప ప్రధానిగా చేసిన అద్వానీ హాజరు కాలేకపోయాడు. దాంతో నేడు ఆయన ఇంటికి వెళ్లి మరీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ భారతరత్నను LK అద్వానికి అందించారు.
Also Read: Puvvada Ajay Kumar: రాష్ట్రంలో నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుంది
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అద్వానికి భారతరత్నం రావడం చాలా సంతోషంగా ఉందని., ఆయనకు ఈ గౌరవం దక్కినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పకోచ్చారు. అద్వానీ అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధానిగా దేశానికి సేవలందించే స్థాయికి ఎదిగిన జీవితం ప్రజలకు స్ఫూర్తిదాయకమందు తెలిపారు. అద్వానీ ఇదివరకు కేంద్ర హోం మంత్రిగా, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వీటితోపాటు ఆయన పార్లమెంటు జోక్యాలు ఎల్లప్పుడూ ఆదర్శవంతమైనవని., అలాగే గొప్ప నిర్ణయాలు తీసుకుంటారని అద్వానికి భారతరత్నను ప్రకటిస్తూ నరేంద్ర మోడీ తెలిపారు.
Also Read: Khammam: పోడు భూముల వివాదం.. పోలీసులపై కర్రలతో దాడి
ఇక అద్వానీ నవంబర్ 8, 1927 పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. ఆపై 1980లో బిజెపి పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అనేక మార్లు పార్టీ అధ్యక్షులుగా పని చేశారు. 1999 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్న సమయంలో అద్వాని హోంమంత్రి, ఒక ప్రధానిగా దేశానికి సేవలు అందించారు.
VIDEO | President Droupadi Murmu confers Bharat Ratna to former deputy PM and BJP leader LK Advani. pic.twitter.com/wOTxeQplG6
— Press Trust of India (@PTI_News) March 31, 2024