Wayanad: రేపే వయనాడ్ బైపోల్.. ప్రియాంక-నవ్య హరిదాస్ మధ్య తీవ్రపోటీ
- బుధవారం వయనాడ్ బైపోల్
- ప్రియాంక.. నవ్య హరిదాస్ మధ్య తీవ్రపోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నిక బుధవారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వయనాడ్ సహా 31 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోదరీ ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు. తొలిసారి ప్రియాంక ఎన్నికల రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికే పరిమితమైన ప్రియాంక ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక ఇక్కడ బీజేపీ.. నవ్య హరిదాస్ అనే మహిళా కీలక నేతను రంగంలోకి దింపింది. ప్రస్తుతం ప్రియాంక వర్సెస్ నవ్య అన్నట్టుగా పోటీ నెలకొంది. మరీ వయనాడ్ ప్రజలు ఎవరికీ పట్టం కడతారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్..
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
బుధవారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వయనాడ్ లోక్‌సభ స్థానం, 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 13న ఓటింగ్ జరగనుంది. వాస్తవానికి నవంబర్ 13 ఓటింగ్ జరగాల్సిన సిక్కింలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ లేదు. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల
వయనాడ్‌లో ప్రియాంక పోటీ చేయడంతో దేశ వ్యాప్తంగా ఫోకస్ పడింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు. అయితే రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్‌ను వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
31 అసెంబ్లీ స్థానాలు ఇవే..
అస్సాం: ధోలై, సిడ్లీ, బొంగైగావ్, బెహాలి, సమగురి
బీహార్: తరారీ, రామ్‌గఢ్, ఇమామ్‌గంజ్, బెలగంజ్
ఛత్తీస్‌గఢ్: దక్షిణ రాయ్‌పూర్ నగరం
గుజరాత్: వావ్
కర్ణాటక: షిగ్గావ్, సండూర్, చన్నపట్న
కేరళ: చెలక్కర
మధ్యప్రదేశ్: బుధ్ని, విజయ్‌పూర్
మేఘాలయ: గ్రామ్‌బేఘాలయ
రాజస్తాన్: జుంఝును, రామ్‌ఘర్, దౌసా, డియోలీ-ఉనియారా, ఖిన్వ్సర్, సాలంబెర్, చోరాసి
పశ్చిమ బెంగాల్: సితాయ్, మదారిహత్, నైహతి, హరోవా, మేదినీపూర్, తల్దంగ్రా
తాజావార్తలు
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!