Election Commissioners: కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commissioners: భారత ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎంపిక చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ రోజు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రస్తుతం ప్యానెల్‌లో కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈయనకు సాయం చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇరువురిని ఎంపిక చేసింది. ఈ సమావేశానికి పీఎం మోడీతో పాటు ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
Read Also: CAA: సీఏఏ మతపర వివక్ష చూపిస్తోంది.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అసహనం..
Also Read
అయితే, సెలక్షన్ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకోవడంపై అధిర్ రంజన్ కేంద్రంపై మండిపడ్డారు. ఈ కమిటీలో భారత ప్రధాని న్యాయమూర్తికి చోటు ఉండాల్సిందని, గతేడాది తీసుకువచ్చిన కొత్త చట్టం దీన్ని కుదించిందని, ప్యానెల్‌లో ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, వారు కోరుకుంటున్నది జరిగిందని ఆయన అన్నారు.
నిన్న రాత్రి తన పరిశీలన కోసం 212 పేర్లను ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకుంటే, ఈ రోజు మధ్యాహ్నం మీటింగ్ జరిగిందని, ఎవరైనా ఒకే రోజులో ఇంత మంది పేర్లను ఎలా పరిశీలిస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. సమావేశానికి ముందు తనకు 6 పేర్లను షార్ట్ లిస్టును అందించారని, మెజారిటీ వారి వద్ద ఉంది, కాబట్టి వారికి కావాల్సిన అభ్యర్థులను కమిషనర్లుగా నియమించుకున్నారని అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ఇది ఏకపక్షమని తాను అనడం లేదు కానీ, అనుసరిస్తున్న విధానంలో లోపాలు ఉన్నాయని అన్నారు.
#WATCH | Gyanesh Kumar from Kerala and Sukhbir Singh Sandhu from Punjab selected as election commissioners, says Congress MP Adhir Ranjan Chowdhury. pic.twitter.com/FBF1q44yuG
— ANI (@ANI) March 14, 2024
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!