Bull Runs Through Congress’ Gujarat Rally, Ashok Gehlot Blames BJP: గుజరాత్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. మంగళవారంతో గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సారి ఎలాగైనా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తోంది. అయితే బీజేపీని తట్టుకుని ఏ మేరకు పోటీ ఇవ్వనుందో చూడాలి. ఇదిలా ఉంటే చివరిరోజు కాంగ్రెస్ ముఖ్యనేతలు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరికొంత మంది కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
Read Also: Heart Attack: విషాదం.. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
ఇదిలా ఉంటే గుజరాత్ మోహసానాలో సోమవారం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ర్యాలీలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో ఓ ఎద్దు ర్యాలీలోకి ప్రవేశించి హల్చల్ చేసింది. ఎద్దును చూసి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఎద్దు, ప్రజలను చూసి అటూ ఇటూ పరిగెత్తింది. దీంతో వేదికపై ఉన్న గెహ్లాట్ ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు, అశోక్ గెహ్లాట్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇది బీజేపీ కుట్ర అని.. కాంగ్రెస్ సమావేశానికి భంగం కలిగించడానికి ఇలాంటి పనులు చేస్తారని గెహ్లాట్ విమర్శించారు.
182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1,5వ తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరనుంది. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఫలితాలతో పాటు గుజరాత్ ఫలితాలు వెల్లడవనున్నాయి. తొలి విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎన్నికల బరిలో ఉంది. దీంతో గుజరాత్ లో త్రిముఖ పోటీ జరగనుంది.
Bull in Congress Rally
Nifty is at ATH🔥🔥 pic.twitter.com/TU9R6miyCJ
— Ashish Kumar (@BaapofOption) November 28, 2022