బీటీంగ్ రిట్రీట్ సమయంలో పాకిస్తానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లు తెరవబోమని భారత అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం చేయడం జరగదని తేల్చి చెప్పారు. కానీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రోగ్రం జరగబోతుంది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్య దాడికి దిగి కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 27లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు గడువునిచ్చింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని ‘లీవ్ ఇండియా’ నోటీసు నుంచి మినహాయించారు. స్వల్పకాలిక వీసాల 12 వర్గాలలో దేనినైనా కలిగి ఉన్న పాకిస్తానీయుల గడువు ఆదివారంతో ముగిసింది. Also…
India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్‌తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థానీయులను వివాహం చేసుకున్న చాలా మంది భారతీయ మహిళలు ఇబ్బందుల్లో పడ్డారు. పాకిస్థానీ వ్యక్తులను పెళ్లి చేసుకున్న హిందుస్థానీ మహిళలు.. భారత్‌లోని తమ ఇళ్లను విడిచిపెట్టి అత్తమామల ఇళ్లకు(పాక్) వెళ్లడానికి సిద్ధమయ్యారు. అలాంటి అనేక మంది మహిళలను అట్టారి-వాఘా సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ దళాలు నిలిపి వేశాయి. బీఎస్ఎఫ్ ప్రకారం.. పాకిస్థానీయులు దేశం దాడి వెళ్లేందుకు ప్రభుత్వం 48 గంటల కాలపరిమితిని ఇచ్చింది. ఇందులో దాదాపు 287 మంది పాకిస్థానీ…