India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్‌తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.