హీరో ఎలివేషన్లకు, ఊర మాస్ ఫైట్లకు, హారర్ కామెడీలతో విసుగుపోయిన బాలీవుడ్ జనాలకు హార్ట్ టచ్చింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన ఫిల్మ్ సైయారా. పెద్ద హైప్ అండ్ హోప్ లేకుండా జులై 18న థియేటర్లలోకి వచ్చి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అవాక్కయ్యేలా కాసుల సునామి సృష్టిస్తోంది. సినిమా వచ్చి ఇరవై రోజులైనా గల్లాపెట్టి నింపుతూ నిర్మాతలకు ఊహించనంత పర్సెంటైజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహన్ పాండే, అనీత్ పద్దాకు లైఫ్ టైమ్ మొమొరబుల్ మూవీగా సైయారా మారింది అనడంలో నో డౌట్.
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కిన సైయారా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిన ఈ ఫిల్మ్ ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. 2025 రిలీజైన హిందీ చిత్రాల్లో ఛావా తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టుకున్న సెకండ్ ఫిల్మ్‌గా మారింది. అంతే కాదు హృతిక్, షారూఖ్ హిట్ చిత్రాల కలెక్షన్లను క్రాస్ చేసింది. 2023లో షారూక్ అండ్ రాజ్ కుమార్ హీరాని కాంబోలో వచ్చిన డంకీ కలెక్షన్లను ఓవర్ టేక్ చేసింది ఈ యూత్ ఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ. డంకీ మాత్రమే కాదు హృతిక్ రోషన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ సాధించిన వార్ ఓవరాల్ కలెక్షన్లు రూ. 475 కోట్లు కాగా, ఇప్పుడు ఈ నంబర్‌ను క్రాస్ చేసి ధూమ్3, టైగర్ జిందా హై, పద్మావత్ గ్రాస్ వసూళ్లను టార్గెట్ చేస్తోంది. అయితే నెక్ట్స్ వీక్ వరకు అంటే వార్ 2 వచ్చేంత వరకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేదంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్లో కంటిన్యూ అయితే రూ. 750 మార్క్ చేరువ కావడం పెద్ద కష్టం కాదంటున్నారు.