Boeing 787-8 Dreamliner: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, సహాయక సిబ్బందితో కలిపి విమానంలో 242 మంది ఉన్నారు. విమానం కూలిన వెంటనే మంటల్లో చిక్కుకుంది. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఇప్పుడు డ్రీమ్ లైనర్ విమానం ప్రత్యేకతల గురించి చర్చ నడుస్తోంది.
డీమ్ లైనర్ ప్రత్యేకతలు ఇవే:
ఇదిలా ఉంటే, బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాన్ని 2011లో ప్రవేశ పెట్టింది. బోయింగ్ 767-200ER మరియు ఎయిర్‌బస్ A330-200 వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే పాత విమానాల స్థానంలో బోయింగ్ డ్రీమ్ లైనర్‌ని తీసుకువచ్చింది. ఇది పెద్ద ఎలక్ట్రానిక్ డిమ్మబుల్ విండోలు, మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం రేక్డ్ వింగ్‌టిప్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. విమానంలో ఫ్రేమ్‌లో సగం కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ పాలిమర్ నిర్మాణాన్ని కలిగి ఉంది. దీంతో బరువు తక్కువగా ఉండటంతో పాటు, ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అందుకే అంతర్జాతీయంగా పలు విమానయాన సంస్థలు ఇంధన వినియోగం కోసం ఈ డ్రీమ్ లైనర్‌లను తమ ఫ్లీట్ లో చేర్చుకుంటున్నాయి.
విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. 2-క్లాస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. 787-7 డ్రీమ్ లైనర్ ఒకేసారి 13,530 కి.మీ ప్రయాణించగలదు. అందుకునే దీనిని సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వినియోగిస్తుంటారు. ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన 787-8 డ్రీమ్ లైనర్ రెండు ఇంజన్లను కలిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా కాకుండా అమెరికన్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, జపాన్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్ మరియు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ క్యారియర్‌లు ఈ విమానాన్ని కలిగి ఉన్నాయి.
14 సంవత్సరాలలో 787 డ్రీమ్‌లైనర్ ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చింది. విమానయాన చరిత్రలో ఏ ఇతర వైడ్ బాడీ జెట్ కూడా ఈ ఘనత సాధించలేదు. దీని డిజైన్, ఇంధన సామర్థ్యం విమానయాన సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టింది. తేలికైన దీని నిర్మాణం కారణంగా, ఇది పాత విమానాల కన్నా 25 శాతం తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. డీమ్ లైనర్ ఫ్యామిలీలో 2000 కంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తే, దీనిలో 26 శాతం 787-8 వేరియంట్ విమానాలు ఉన్నాయి.జనవరి 2023 నాటికి 386 యూనిట్లు డెలివరీ చేయబడ్డాయి.