Delhi : రాజకీయ లాభం కోసం ఎన్నికలకు ముందు ఉచిత పథకాలు అందించడం వంటి వాటికి ప్రస్తుతం చట్టపరమైన నిర్వచనం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం నుండి దీనికి సమాధానం కోసం వెతుకుతోంది.
Minister Seethakka : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఆలయ పాలక వర్గం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పరిగి ,కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ రైతు వ్యవసాయ మానేస్తే కుక్కకు కూడా అన్నం దొరకదని అన్నారు. అదేవిధంగా పేదింటి బిడ్డలు సన్న…
ఏ కేటగిరిలోనూ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగా రావు వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని, అన్ని పిటిషన్ ల పై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించిందన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున సాగుచేయడం కోసం మన రాష్ట్రం లో 31 జిల్లాలకు అనుమతులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ తో పాటుగా 14 ప్రయివేటు కంపెనీలు పామాయిల్ విస్తరణ కు ముందుకొచ్చాయని, ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఆయిల్ ఫెడ్ కేంద్రం ఉంటుందన్నారు.
BJP: ప్రజలకు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ‘ఉచితాలు’ ఇవ్వడాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారే అవకాశం ఉందని చెబుతోంది. ఉచితాలు కాకుండా ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తోంది. గతేడాది కర్ణాటక ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీ ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఉచితాల రాష్ట్రాలు అప్పులపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.