Parliament scuffle: డిసెంబర్ 19న పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర షడంగీ, ముకేశ్ రాజ్‌పూత్ గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒక ఎంపీ షడంగీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ‘‘హత్యాయత్నం’’ కేసు పెట్టారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ ఎంపీలపై కుట్ర, దుష్ప్రవర్తన కేసులను పెట్టింది. అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలపై ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
BJP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ‘‘ అంబేద్కర్ ’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల్ని పెంచాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీనికి ప్రతిగా బీజేపీ కూడా అంతే ధీటుగా అంబేద్కర్‌ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలపై దాడి సంచలనంగా మారింది.
Rahul Gandhi: అమిత్ షా రాజ్యసభ స్పీచ్‌పై పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌కి చెందిన ఎంపీలు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని, ఎడిటెడ్ వీడియోను ప్రచారం చేస్తోందని, నిజానికి అంబేద్కర్‌ని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీనే అని బీజేపీ ఎదురుదాడికి దిగింది.