BJP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ‘‘ అంబేద్కర్ ’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల్ని పెంచాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీనికి ప్రతిగా బీజేపీ కూడా అంతే ధీటుగా అంబేద్కర్‌ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలపై దాడి సంచలనంగా మారింది.