WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో మూడో మ్యాచ్ ఆదివారం వడోదరలోని కోటంబి స్టేడియంలో యుపి వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దీప్తి శర్మ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్ 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా గుజరాత్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ నిలిచింది. ఈ సంద్రాభంగా ఆమె మాట్లాడుతూ.. తన సొంత మైదానంలో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, మూడు వికెట్లు పడగొట్టి యుపి వారియర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసిన లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రాను కూడా ప్రశంసించింది.
Read Also: IND vs PAK: భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్‌బస్టర్ పోరు.. అద్భుతమైన ప్రదర్శన చేసేది వీళ్లే..!
లక్ష్యాన్ని ఛేదించే సమయంలో గుజరాత్ ఆరంభం అంతగా బాగాలేదు. తొలి ఓవర్లోనే హారిస్ దెబ్బకు ఖాతా కూడా తెరవలేక బెత్ మూనీ రూపంలో జట్టుకు తొలి దెబ్బ తగిలింది. దీని తర్వాత సోఫీ ఎక్లెస్టోన్ దయాళన్ హేమలతను బౌల్డ్ చేసింది. ఆమె కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు తిరిగి వచ్చింది. దీని తరువాత లారా, ఆష్లే గార్డనర్ బాధ్యత చేపట్టారు. దానితో వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు కీలకమైన 55 పరుగుల భాగస్వామ్యం నమోదయింది.
Read Also: Road Accident: వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!
Wickets ✅
Runs ✅
Outstanding catch ✅#GG skipper Ash Gardner wins the Player of the Match award for her commanding all-round show 🫡Scorecard ▶ https://t.co/KpTdz5nl8D#TATAWPL | #GGvUPW pic.twitter.com/i8owZcnK4t
— Women's Premier League (WPL) (@wplt20) February 16, 2025
దీని తరువాత గార్డనర్ కు హర్లీన్ డియోల్ మద్దతు లభించింది. వీరిద్దరి మధ్య నాలుగో వికెట్ కు 29 పరుగుల భాగస్వామ్యం రాగా.. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ అర్ధ సెంచరీ సాధించింది. ఆమె 32 బంతుల్లో 52 పరుగులు చేసింది. యూపీ తరఫున సోఫీ ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా, గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ ఎడిషన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న యుపి వారియర్స్‌కు కూడా మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టు 22 పరుగుల వద్ద తమ ఓపెనర్లు ఇద్దరి వికెట్లను కోల్పోయింది. డియాండ్రా డాటిన్ కిరణ్ నవ్‌గిరే వికెట్‌ను పడగొట్టింది. దీని తర్వాత, ఆష్లే గార్డనర్ దినేష్ బృందాను అవుట్ చేశాడు. ఆమె కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి తిరిగి వచ్చింది.