దక్షిణాది ఫిలీం ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో నయన తార- విఘ్నేశ్ శివన్ జోడీ ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.అలా పెళ్లి చేసుకున్న కొద్ది నెలల్లోనే వీరిద్దరు సరోగసీ విధానంలో ఇద్దరు మగ పిల్లలను కన్నారు. ఈ ట్విన్స్ కు ఉయిర్, ఉల్గం అని పేర్లు పెట్టుకున్నారు. ఇక ఈ జంట వారి పనుల్లో వారు ఉంటున్న కూడా, ఎప్పుడు వీరిపై .. ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. గతంలో కూడా నయన తార ప్రాపర్టీ తో కంపేర్ చేస్తే.. విఘ్నేశ్ శివన్ ఆస్తులు చాలా తక్కువని వార్తలు వచ్చాయి. కానీ ఇలాంటి వార్తలు ఎన్ని పుట్టించిన కూడా నయనతార,విఘ్నేష్ శివన్ ఎప్పుడు ఎక్కడ కూడా చలించలేదు.
Also Read:Producer SKN: తెలుగు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కామెంట్స్ వైరల్..
ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న ఇంట్లో ప్రతి ఒక సెలబ్రెషన్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. కానీ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కూడా ఈ మధ్య కాలంలో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా తన భర్తతో కలిసి ఓ వీడియో షేర్ చేసింది ఈ అమ్మడు. ఇందులో వారు ఇద్దరు ముఖంలో ముఖం పెట్టి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ’ మూవీలోని థీమ, థీమ.. అనే తమిళ పాట పాడుతూ రోమాంటీక్‌గా వీడియె తీసుకున్నారు. దాని తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది నయనతార.