SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SpaceX: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ స్టార్ షిప్ మెగా రాకెట్ చివరి దశలో విఫలమైనట్లు తెలుస్తోంది. చంద్రుడు, ఇతర ఇంటర్ ప్లానెటరీ మిషన్ల కోసం వ్యోమగాములను పంపడానికి ఉద్దేశించబడిన ఈ ప్రయోగం గురువారం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి స్టార్ షిప్ రాకెట్ ఎక్కువ దూరం, ఎక్కువ వేగాన్ని సాధించింది. అయితే రీ ఎంట్రీ సమయంలో భూమి వైపు తిరిగి వస్తుండగా అది సిగ్నల్‌ని కోల్పోయింది. స్పేస్‌క్రాఫ్ట్ హైపర్‌సోనిక్ వేగంతో భూవాతావరణంలోకి తిరిగి వస్తుండగా ఒకేసారి మిషన్ కంట్రోల్ రెండు శాటిలైట్ వ్యవస్థల నుంచి స్టార్ షిప్‌తో సంబంధాలు కోల్పోయిందని స్పేస్ఎక్స్ తెలిపింది.
టెక్సాస్‌లోని బోకా చికాలోని కంపెనీ స్టార్ బేస్ నుంచి మెగా రాకెట్ నింగిలోకి వెల్లింది. ఈ దశాబ్ధం చివరి నాటికి చంద్రుడిపై వ్యోమగాముల్ని ల్యాండ్ చేయడానికి నాసా ప్రణాళికల్లో ఈ రాకెట్ చాలా ముఖ్యమైంది. ఏదో రోజు మార్స్‌పైకి కూడా మానవులను తీసుకెళ్లానే ఎలాన్ మస్క్ కల ఈ రాకెట్ ద్వారా సాధించే అవకాశం ఉంది. గతంలో జరిగిన రెండు టెస్ట్ ఫ్లైట్లతో పోలిస్తే ఈ సారి రాకెట్ మరింత వేగంగా, మరింత దూరం ప్రయాణించింది. కానీ భూవాతావరణంలోకి వస్తుండగా సిగ్నల్ కోల్పోయింది. దీనికి కారణాలు ఏంటనే విషయం స్పష్టంగా తెలియలేదు. రీఎంట్రీ సమయంలో భూవాతావరణంలోకి రాగానే ఘర్షణ కారణంగా వేల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీనిని రాకెట్ తట్టుకుని భూమి మీదకు రావాల్సి ఉంటుంది.
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
Read Also: WPL 2024: నేడు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్.. ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
స్టార్ షిప్ రెండు దశల్ని కలిపినప్పుడు దాని ఎత్తు స్టాచ్యు ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా 121 మీటర్ల పొడవు ఉంటుంది. దాని హెవీ బూస్టర్లు 16.7 మిలియన్ పౌండ్ల (74.3 మెగాన్యూటన్‌లు) థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత శక్తివంతమైన రాకెట్. రాకెట్ గంటలకు 26,000 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది, సముద్ర మట్టానికి 200 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లింది. ఆ తర్వాత హిందూ మహాసముద్రం మీదుగా భూమి వైపు అవరోహణ ప్రారంభించింది. అయితే, చివరి నిమిషాల్లో గ్రౌండ్ కంట్రోల్ సిగ్నల్స్ అందుకోవడం ఆగిపోయింది. బూస్టర్‌ని వాటర్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైంది. దీనిపై విచారణ ప్రారంభించారు.
స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ తొలి టెస్ట్ ఫ్లైట్ ఏప్రిల్ 2023లో జరిగింది. నింగిలోకి ఎగిసిన కొన్ని నిమిషాల్లో సాంకేతిక సమస్యలతో రాకెట్‌ని పేల్చేయాల్సి వచ్చింది. నవంబర్ 2023లో జరిగి టెస్ట్ ఫ్లైట్ గతంలో దాని కన్నా మెరుగైన ఫలితాలను సాధించింది. ఆ సమయంలో కూడా ప్రయోగం విఫలమైంది. స్టార్ షిప్ నిర్మాణానికి 90 మిలియన్ డాలర్లను స్పేస్ఎక్స్ ఖర్చు చేస్తోంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్లు నాసా వాణిజ్యరంగానికి గెలుపు గుర్రాలుగా మారాయి. డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా వ్యోమగాముల్ని, సరుకుల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) పంపుతోంది. 2026లో నాసా చంద్రుడిపైకి వ్యోమగాముల్ని పంపాలని అనుకుంటోంది. ఈ ప్రయోగానికి స్టార్ షిప్ చాలా కీలకం.
SpaceX Starship IFT-3 liftoff seen from Mexico at about 4 km from the launch pad
[📹 Alex Ramos]https://t.co/a9O8pWeq7y
— Massimo (@Rainmaker1973) March 14, 2024
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!